అత్యంత వేడిని తట్టుకొనే కొత్త పదార్థం.. రష్యా శాస్త్రవేత్తల సృష్టి

ABN , First Publish Date - 2020-05-30T00:21:17+05:30 IST

ఇప్పటివరకు మనకు తెలిసి అత్యంత వేడిని తట్టుకోగల పదార్థం హాఫ్నియమ్ కార్బైడ్. టైటానియం, టంగ్‌స్టన్, కోబాల్ట్, ఇనుము, ఇలా మరికొన్ని...

అత్యంత వేడిని తట్టుకొనే కొత్త పదార్థం.. రష్యా శాస్త్రవేత్తల సృష్టి

మాస్కో: ఇప్పటివరకు మనకు తెలిసి అత్యంత వేడిని తట్టుకోగల పదార్థం హాఫ్నియమ్ కార్బైడ్. టైటానియం, టంగ్‌స్టన్, కోబాల్ట్, ఇనుము, ఇలా మరికొన్ని పదార్థాలు కూడా వేడిని చాలా వరకు తట్టుకోగలవు. అయితే ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నే మరొక పదార్థాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రష్యాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాటజీ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పదార్థాన్ని కనిపెట్టారు. దీనికి హాఫ్నియమ్ కార్బోనిట్రైడ్ అని పేరు పెట్టారు. ఇప్పటివరకు మనకు తెలిసిన అన్ని పదార్థాల కంటే ఇది అత్యంత ఎక్కువ వేడిని తట్టుకోగలదని వారు చెబుతున్నారు. ఈ పదార్థాలు దాదాపు 4000 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-30T00:21:17+05:30 IST