Abn logo
Aug 1 2020 @ 22:17PM

రష్యాలో ఒకేరోజు ఐదు వేలకు పైగా కరోనా కేసులు

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. గడిచిన 24 గంటల్లో రష్యాలో 5,462 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8,45,443కు చేరింది. మొత్తం 83 రీజియన్ల నుంచి ఈ కేసులు బయటపడినట్టు రెస్పాన్స్ సెంటర్ శనివారం వెల్లడించింది. రాజధాని మాస్కో నుంచి అత్యధికంగా 690 కరోనా కేసులు బయటపడ్డాయి. రష్యాలో నిత్యం మాస్కో నుంచే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో 1,356 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 95 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,058కు చేరుకుంది. ఇక ఒకేరోజు 8,755 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రష్యాలో ఇప్పటివరకు మొత్తం 6,38,410 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలున్నాయి. అమెరికా అయితే కరోనా కేసులు, మరణాల విషయంలో ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 47 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా..లక్షా 57 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement
Advertisement