Abn logo
Aug 13 2020 @ 23:51PM

మరో తెలుగు దర్శకుడికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా కనబడుతోంది. రాజమౌళి ఫ్యామిలీ కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్, ఎస్.పి. బాలు, డైరెక్టర్ తేజ, నిర్మాత దానయ్య, సింగర్ స్మిత.. ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారు, వీరు అని తేడా లేకుండా అందరినీ కరోనా టార్గెట్ చేస్తుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా విషయంలో వణుకుతూనే ఉంది. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కరోనాని కంట్రోల్ చేయడం కష్టమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా ఏదో ఒక రూపంలో మానవాళిని చుట్టేస్తూనే ఉంది. తాజాగా టాలీవుడ్‌లోని మరో దర్శకుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది.


ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా తనెంటో నిరూపించుకున్న అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయం ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.. ‘‘వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా..’’ అంటూ అజయ్ భూపతి తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్స్‌కి అందరూ మీరు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement