సగ్గుబియ్యం పునుకులు

ABN , First Publish Date - 2020-08-14T19:27:37+05:30 IST

పుల్ల పెరుగు - ఒక కప్పు, సగ్గుబియ్యం - ముప్పావు కప్పు, నీరు - అరకప్పు, కొత్తిమీర తరుగు -

సగ్గుబియ్యం పునుకులు

కావలసిన పదార్థాలు: పుల్ల పెరుగు - ఒక కప్పు, సగ్గుబియ్యం - ముప్పావు కప్పు, నీరు - అరకప్పు, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, బియ్యప్పిండి - ముప్పావు కప్పు, అల్లం తరుగు - ఒక టీ స్పూను, నూనె - వేగించడానికి , పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్‌ స్పూను.


తయారుచేసే విధానం: పెరుగులో కడిగిన సగ్గుబియ్యం వేసి బాగా కలిపి నీరుపోసి కనీసం 4 గంటలు నానబెట్టాలి. పెరుగు పుల్లగా లేకపోతే ఒక టీ స్పూను నిమ్మరసం వేసుకోవచ్చు. నానిన సగ్గుబియ్యంలో కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉల్లి తరుగు, బియ్యప్పిండి, అల్లం తరుగు వేసి బాగా కలపాలి. మరీ గట్టిగా ఉంటే 2 స్పూన్ల నీరు కలపాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని పునుకులుగా వేసి దోరగా వేగించి వేడివేడిగా తినాలి. 


Updated Date - 2020-08-14T19:27:37+05:30 IST