సగ్గుబియ్యం పొంగనాలు

ABN , First Publish Date - 2020-03-15T17:39:17+05:30 IST

సగ్గుబియ్యం - ఒక కప్పు, బంగాళదుంపలు - 2, వేగించిన పల్లీలు - అరకప్పు, పచ్చిమిర్చి - 3, పసుపు - పావు టీ స్పూను, కారం - అర టీ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం -

సగ్గుబియ్యం పొంగనాలు

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - ఒక కప్పు, బంగాళదుంపలు - 2, వేగించిన పల్లీలు - అరకప్పు, పచ్చిమిర్చి - 3, పసుపు - పావు టీ స్పూను, కారం - అర టీ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం - అంగుళం ముక్క, కరివేపాకు - 4 రెబ్బలు, నిమ్మరసం - అరచెక్క, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు. 


తయారుచేసే విధానం: సగ్గుబియ్యం శుభ్రంచేసి మునిగేవరకు నీరుపోసి 4 గంటలు నానబెట్టాలి. పల్లీలను బరకగా మిక్సీ పట్టాలి. అదే మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి నీరు పోయకుండా బరకగా పేస్టు చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు తొక్కతీసి మెదపాలి. ఇప్పుడొక వెడల్పాటి బౌల్‌లో నీరు వడకట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప గుజ్జు, పల్లీ బరక, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు తరుగు, నిమ్మరసం వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని పక్కనుంచాలి. ఇప్పుడు పొంగనాల పెనం గుంతల్లో నూనె రాసి ఒక్కో ఉండని గుంతల్లో ఉంచి చిన్నమంటపై వేగించాలి. రెండోవైపు తిప్పినప్పుడు  గుంతల్లో నూనె చుక్కలు వదలాలి. అన్నివైపుల వేగిన తర్వాత తీసి, వేడి వేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి. 

Updated Date - 2020-03-15T17:39:17+05:30 IST