వారి విలువ తెలిసొచ్చింది

ABN , First Publish Date - 2021-05-13T06:11:26+05:30 IST

కొవిడ్‌ వేళ ప్రతి ఒక్కరికీ నర్సుల విలువ ఏమిటో తెలిసివచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సచిన్‌ వారి సేవలను...

వారి విలువ తెలిసొచ్చింది


  • నర్సులకు సచిన్‌ జేజేలు


ముంబై: కొవిడ్‌ వేళ ప్రతి ఒక్కరికీ నర్సుల విలువ ఏమిటో తెలిసివచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సచిన్‌ వారి సేవలను ప్రస్తుతించాడు. ‘నిద్రలేని రాత్రులు గడుపుతూ రోగుల ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరిస్తూ మానవాళికి నర్సులు నిరంతరం సేవలు అందిస్తున్నారు’ అని టెండూల్కర్‌ కొనియాడాడు.



Updated Date - 2021-05-13T06:11:26+05:30 IST