25వ పెళ్లిరోజు సందర్భంగా.. సచిన్ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2020-05-26T00:53:31+05:30 IST

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. సోమవారం తన 25వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. 1995 సంవత్సరంలో ఆయన అంజలిని వివాహమాడారు.

25వ పెళ్లిరోజు సందర్భంగా.. సచిన్ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. సోమవారం తన 25వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. 1995 సంవత్సరంలో ఆయన అంజలిని వివాహమాడారు. అయితే తమ 25వ పెళ్లి రోజు సందర్భంగా సచిన్ తన కుటుంబసభ్యులకు ఓ ప్రత్యేకమైన కానుక అందించారు. తన స్వహస్తాలతో ఆయన కుటుంబసభ్యుల కోసం మ్యాంగో కుల్ఫీ తయారు చేశారు. 


అందుకు సంబంధించిన వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సచిన్.. కాస్త విభిన్నంగా మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో కూడా సచిన్ వివరించారు. ఈ వీడియోలో సచిన్ తల్లి కూడా కనిపించారు. కుల్ఫీ పూర్తయిన తర్వాత దాన్ని టేస్ట్ చేసిన సచిన్.. ‘‘అద్భుతంగా ఉంది.. ఇంకా తినాలని ఉంది కానీ, వారి కోసం దాచి ఉంచుతాను. అందరం కలిసి తింటాము’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోని మీరూ చూసేయండి...



Updated Date - 2020-05-26T00:53:31+05:30 IST