సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-10-21T04:40:59+05:30 IST

గ్రామాల్లో ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులకు జేసీ హరేందిర ప్రసాద్‌ సూచించారు.

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి
మనుబోలు సచివాలయంను తనిఖీ చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌

జేసీ హరేందిర ప్రసాద్‌


మనుబోలు, అక్టోబరు 20: గ్రామాల్లో ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులకు జేసీ హరేందిర ప్రసాద్‌ సూచించారు. మనుబోలులోని రెండు సచివాలయాలను  బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు 546 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. సమస్యలతో సచివాలయాలకు వచ్చే ప్రజలతో నిదానంగా మాట్లాడాలన్నారు. వారి సమస్యను పూర్తిగా విని పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టును భర్తీ చేస్తామన్నారు. అలాగే మరో ఆధార్‌ నమోదు కేంద్రంను త్వరలోనే ఇస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వై.నాగరాజు, ఈవోపీఆర్‌డీ వెంకటరమణ, ఆర్‌ఐ. సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T04:40:59+05:30 IST