అలా లాగిన్‌ ఎంత వరకు సురక్షితం?

ABN , First Publish Date - 2020-06-13T05:48:41+05:30 IST

ఫేస్‌బుక్‌, జీమెయిల్‌లతో లాగిన్‌ కావడానికి చాలా అప్లికేషన్స్‌ అవకాశం కల్పిస్తాయి కదా! అలా లాగిన్‌ కావడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా?...

అలా లాగిన్‌ ఎంత వరకు  సురక్షితం?

ఫేస్‌బుక్‌, జీమెయిల్‌లతో లాగిన్‌ కావడానికి చాలా అప్లికేషన్స్‌ అవకాశం కల్పిస్తాయి కదా! అలా లాగిన్‌ కావడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? తెలియజేయగలరు. 

- వరుణ్‌, హైదరాబాద్‌


వివిధ వెబ్‌ సర్వీసుల్లో, అప్లికేషన్లను ఉపయోగించడానికి ముందు వాటిలో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో పేరు, ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వంటి వివరాలు టైప్‌ చేసిన తర్వాత మాత్రమే ఎకౌంట్‌ క్రియేట్‌ అయ్యేది. ప్రస్తుతం అధికశాతం అప్లికేషన్లు ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విట్టర్‌, ఐక్లౌడ్‌ వంటి అకౌంట్ల ఆధారంగా రిజిస్టర్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా సోషల్‌సైట్ల ద్వారా లాగిన్‌ అయినప్పుడు, మీ పేరు, వయసు, ఈమెయిల్‌ ఐడీ వంటి ప్రాథమిక సమాచారం మాత్రమే సంబంధిత అప్లికేషన్లకు షేర్‌ అవుతుంది, అదనంగా ఎలాంటి డేటా వారికి లభించదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


భారీగా పెరిగిన వినియోగం...

ఇంటర్నెట్‌ వినియోగం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారింది. తెలిసి తెలియక ఒక లింకు క్లిక్‌ చేస్తే, ఒక ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేస్తే చాలు కంప్యూటర్లు, ఫోన్లు, ఈ-వాలెట్లు అన్నీ హ్యాక్‌ అవుతున్నాయి. ‘ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వెల్లడించిన గణాంకాల ప్రకారం నవంబర్‌ 2019 నాటికి దేశవ్యాప్తంగా 504  మిలియన్ల ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నారు. 2023 నాటికి ఈ సంఖ్య 650 మిలియన్లకు చేరుతుందని అంచనా.  అయితే చాలామంది వినియోగదారులకు  సైబర్‌ భద్రత మీద ప్రాథమిక అవగాహన కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అధిక శాతం బ్యాంకింగ్‌ లావాదేవీలు ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ క్షణం దేశవ్యాప్తంగా వేలకొద్ది ఆర్థిక నేరాలు నమోదవుతున్నాయి.  డబ్బు పోగొట్టుకున్న వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ డబ్బు వెనక్కి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు.


Updated Date - 2020-06-13T05:48:41+05:30 IST