వైరస్‌ బారిన పడకుండా..!

ABN , First Publish Date - 2020-05-14T07:56:23+05:30 IST

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే చేతులు మాత్రమే శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు. తరచుగా ముట్టుకునే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. బట్టలు, ఫోన్‌, ఇంట్లో రోజూ ఎక్కువగా ఉపయోగించే వస్తువులను సైతం డిజ్‌ఇన్‌ఫెక్ట్‌ చేసుకోవాలన్నది...

వైరస్‌ బారిన పడకుండా..!

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే చేతులు మాత్రమే శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు. తరచుగా ముట్టుకునే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. బట్టలు, ఫోన్‌, ఇంట్లో రోజూ ఎక్కువగా ఉపయోగించే వస్తువులను సైతం డిజ్‌ఇన్‌ఫెక్ట్‌ చేసుకోవాలన్నది నిపుణుల మాట.


సరుకులు కొన్నాక...

  1. కూరగాయలు కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. కూరగాయలు తీసుకొచ్చాక వాటిని నీటిలో వేసి శుభ్రం చేయాలి. కూరగాయలను ఎలాంటి రసాయనాలు వేసి శుభ్రం చేయకూడదు.  ఎక్కువ నీటితో కడిగితే సరిపోతుంది. 
  2. సూపర్‌మార్కెట్లలో కూరగాయలు కవర్స్‌లో ప్యాకింగ్‌ చేసి ఉంటాయి. అలాంటి వాటిని కొనుగోలు చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటిని ముట్టుకున్న తరువాత చేతులను ముఖానికి ఆనించకూడదు. ఇంటికొచ్చాక చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  3. కొన్ని రకాల కిరాణ వస్తువులను నీటితో శుభ్రం చేయలేం. అలాంటి వాటిని డిజ్‌ఇన్‌ఫెక్టెంట్‌ స్ర్పేతో శుభ్రం చేయాలి. డిజ్‌ఇన్‌ఫెక్టెంట్‌ స్ర్పేలో 62-71 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. 



మాస్క్‌ శుభ్రం ఇలా...

  1. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్క్‌ ధరించడం తప్పనిసరి. కాటన్‌ వస్త్రంతో తయారుచేసిన మాస్క్‌లు ధరిస్తే  వాటిని రోజూ శుభ్రం చేసుకోవాలి. 
  2. మాస్క్‌లు శుభ్రం చేసే సమయంలో డిస్పోజబుల్‌ గ్లౌజులు ధరించాలి. ఒకవేళ మీరు ధరిస్తున్న మాస్క్‌కు రిమూవబుల్‌ ఫిల్టర్‌ ఉంటే కనుక దాన్ని తొలగించి, మాస్క్‌ను ఉతకాలి.
  3. క్లాత్‌ మాస్క్‌లను చేత్తో శుభ్రం చేయవచ్చు లేదా వాషింగ్‌ మెషిన్‌లోనూ వేయవచ్చు. అయితే మాస్క్‌ను ఉతికిన తరువాత ఎండలో ఆరబెట్టాలి. ఇస్త్రీ చేసి  తిరిగి ఉపయోగించాలి.



ఫోన్‌ను సైతం...

  1. తరచుగా ముట్టుకునే వాటిలో ఫోన్‌ ఒకటి. కాబట్టి మైక్రోఫైబర్‌ క్లాత్‌ సహాయంతో ఫోన్‌ను శుభ్రం చేసుకోవాలి. 
  2. 70 శాతం ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ వైప్‌తో లేదా క్లొరాక్స్‌ డిజ్‌ఇన్‌ఫెక్టింగ్‌ వైప్స్‌తో ఫోన్‌ను శుభ్రం చేసుకోవచ్చు. 
  3. ఎరోసాల్‌ స్ర్పే, బ్లీచ్‌లు వంటివి ఉపయోగించకూడదు. ఆల్కహాల్‌ బేస్డ్‌ సొల్యూషన్స్‌ను ఉపయోగించవచ్చు. ఫోన్‌ కవర్‌ ఉంటే దానిని తీసి శుభ్రం చేయాలి.

Updated Date - 2020-05-14T07:56:23+05:30 IST