రంగుల పండుగ జాగ్రత్తలివి!
ABN , First Publish Date - 2021-03-29T05:30:00+05:30 IST
హోలీ పండుగను జాలీగా జరుపుకోవడానికి సిద్ధమైపోయి ఉంటారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి...
హోలీ పండుగను జాలీగా జరుపుకోవడానికి సిద్ధమైపోయి ఉంటారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి.
- సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను మాత్రమే వాడండి. కృత్రిమ రంగులకు దూరంగా ఉండండి. న్యాచురల్ కలర్స్‌తో చర్మానికి హానికలగదు. తరువాత శుభ్రం చేసుకోవడం సులువు కూడా!
- హోలీ ఆడే ముందు గాగుల్స్ పెట్టుకోండి. దీనివల్ల కళ్లకు రక్షణ లభిస్తుంది. రంగులు కళ్లలో పడితే ప్రమాదమే. కాబట్టి గాగుల్స్ తప్పనిసరి పెట్టుకోండి.
- ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ప్యాంట్ వేసుకోండి. దీనివల్ల కాళ్లు, చేతులపై రంగులు పడకుండా చూసుకోవచ్చు.
- పెట్రోలియం జెల్లీ, మాయిశ్చరైజర్లు పూసుకోవడం మరువద్దు. తలకు కొబ్బరి నూనె పెట్టుకోండి. దీనివల్ల రంగుల ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
- రంగులు నోట్లోకి పోకుండా చూసుకోవాలి. నోట్లో రంగులు పడితే వెంటనే మంచినీటితో రెండు, మూడుసార్లు పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి.
- కళ్లలో రంగు పడినట్లయితే రుద్దడం చేయకూడదు. నీళ్లతో బాగా కడగాలి. ఒకవేళ కన్ను బాగా ఎర్రబడితే డాక్టర్‌ను సంప్రదించాలి.
- ఆస్తమా, బ్రాంకైటిస్, స్కిన్ అలర్జీ వంటివి ఉన్నట్లయితే రంగులకు దూరంగా ఉండటమే మంచిది.