సాగర్‌ సిమెంట్స్‌ లాభం రూ.50 కోట్లు

ABN , First Publish Date - 2020-10-22T06:49:56+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సాగర్‌ సిమెంట్స్‌ ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన రూ.50.17 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

సాగర్‌ సిమెంట్స్‌ లాభం రూ.50 కోట్లు

  • 20శాతం మధ్యంతర డివిడెండ్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సాగర్‌ సిమెంట్స్‌ ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మూడు నెలలకు  ఏకీకృత ప్రాతిపదికన రూ.50.17 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.4.92 కోట్లతో పోలిస్తే 920 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ.329.17 కోట్లకు చేరింది. అదే తేదీతో ముగిసిన ప్రథమార్ధానికి రూ.594 కోట్ల ఆదాయంపై రూ.86.17 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఏడాది రెండో త్రైమాసికానికి పరిమాణపరంగా సిమెంట్‌ అమ్మకాలు 2 శాతం పెరగ్గా.. ఆదాయం 23 శాతం హెచ్చింది. ప్లాంట్‌లు 48 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించాయి. వ్యయ నియంత్రణ, ధర తదితరాలు లాభదాయకత పెరగడానికి దోహదం చేసినట్లు కంపెనీ జేఎండీ శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.2 (20ు) మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. 


Updated Date - 2020-10-22T06:49:56+05:30 IST