హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సాగర్ సిమెంట్స్ మూడో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.49.59 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.9.08 కోట్ల నష్టాన్ని చవి చూసింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం 39 శాతం వృద్ధితో రూ.262.57 కోట్ల నుంచి రూ.365.66 కోట్లకు చేరింది. సిమెంట్ అమ్మకాలు 13 శాతం పెరిగినట్లు కంపెనీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.959.74 కోట్ల ఆదాయంపై రూ.135.76 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.