Abn logo
Sep 25 2021 @ 00:05AM

ఆరు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల

ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత్‌, సెప్టెంబరు 24: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ ఆరు క్రస్ట్‌ గేట్లను శుక్రవారం ఐదు అడుగుల మేర ఎత్తి 48,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీటిమట్టం స్థిరంగా 590 అడుగులు కొనసాగుతోంది. ఇది 312.04 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 8,144 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 7,190, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,642, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 98,376 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి  సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 98,376 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 882.50 అడుగులుంది. ఇది 202.04 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 37,176 క్యూసెక్కులు, రోజా నుంచి 17,380 క్యూసెక్కులు, మొత్తంగా 54,556 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో వాటర్‌గా వచ్చి చేరుతోంది.