సాగర్‌ నుంచి సాగరానికి

ABN , First Publish Date - 2021-08-02T05:58:22+05:30 IST

కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. సాగ రుడ్ని కలిసేందుకు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలే స్తున్నారు.

సాగర్‌ నుంచి సాగరానికి
14 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

14 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

కృష్ణమ్మకు పోటెత్తుతోన్న వరద ప్రవాహం

ప్రాజెక్టు నుంచి 5 లక్షల క్యూసెక్కులు విడుదల

వరద ప్రవాహంపై పర్యవేక్షణకు కంట్రోలు రూమ్‌లు 

పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు


విజయపురిసౌత్‌, ఆగస్టు 1: కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. సాగ రుడ్ని కలిసేందుకు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలే స్తున్నారు. నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తడంతో బిరబిరా అంటూ కృష్ణమ్మ సాగరం దిశగా పయనిస్తోంది. సాగర్‌కు వరదనీరు పోటెత్తుతుండటంతో రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే దాదాపుగా 300 టీఎంసీలకు చేరుకుంది. దీంతో అధికారులు ఆదివారం 14 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ ధర్మానాయక్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి 13వ గేటు బటన్‌ నొక్కి నీటి విడుదల ప్రారంభించారు. రాత్రికి మరో ఒకటిన్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ధర్మానాయక్‌ చెప్పారు. సాగర్‌ నీటిమట్టం 590 అడుగులకు ఆదివారం రాత్రికి 586.40 అడుగు లు ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ఎడమ కాలువ ద్వారా 601, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 35,364 క్యూసెక్కులు, 14 క్రస్ట్‌గేట్ల ద్వారా 1,08,990 మొత్తం ఔట్‌ఫ్లో 1,47,355 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 4,35,410 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 883.40 అడుగులుంది. జూరాల నుంచి 4,58,791, రోజా నుంచి 71,172 మొత్తంగా 5,29,963 క్యూసెక్కుల నీరు శ్రీశైలా నికి ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌ 

గుంటూరు(ఆంధ్రజ్యోతి): సాగర్‌ జలాశయం నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదల చేస్తోన్నందున కృష్ణానది పరి వాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. ఆదివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. మహరాష్ట్రలో భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోం దన్నారు. ఆదివారం అర్ధరాత్రికి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు సాగర్‌ నుంచి దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ నీరు పులిచింతల ప్రాజెక్టు, ప్రకా శం బ్యారేజ్‌ మీదగా దిగువకు విడుదల చేయడం జరుగు తుందన్నారు. ఈ నేపథ్యంలో గురజాల, మాచర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రెంటచింతల, మాచవరం, అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని గ్రామాలు, లోతట్టు ప్రాం తాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వర ద ముంపునకు గురయ్యే ప్రాంతాల సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, మండల, డివిజన్‌ స్థాయిలోని విపత్తుల నిర్వహణ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కరకట్ట మొత్తాన్ని అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించాల న్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇసుకబస్తాలు పేర్చి బలోపేతం చేయాలని సూచించారు.

  జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ వరద ఉధృతిని పర్యవేక్షించేందుకు, నిరంతరం సమాచారం అందిం చేందుకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌, గుంటూరు, గుర జాల, తెనాలి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ప్రత్యే కంగా కంట్రోలు రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద నీరు వలన తొలుత మునిగే గ్రామాలను గుర్తించి అవ సరమైన చర్యలు తీసుకొంటున్నామన్నారు. జేసీ ప్రశాంతి మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గేంత వరకు సచివాల యాల ఉద్యోగులు 24 గంటలు గ్రామాల్లో అందు బాటులో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. చప్టాల వద్ద పోలీసు, పం చాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తోన్నామన్నారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాబురావు, నాగార్జునసాగర్‌ కుడికాలువ ఎస్‌ఈ గంగరాజు, పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ రమేష్‌బాబు, కృష్ణా రివర్‌ కన్జర్వేటర్‌ ఈఈ స్వరూప్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-02T05:58:22+05:30 IST