Abn logo
Sep 26 2021 @ 23:39PM

రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత, సెప్టెంబరు 26: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా ఆదివారం అధికారులు నీటిని విడుదలచేశారు. నాగార్జున సాగర్‌ నీటిమట్టం 589.70 అడుగులు ఉంది. ఇది 311.14 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 8298 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6556, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 32,602 క్యూసెక్కులు, 2 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,138 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, మొత్తం ఔట్‌ఫ్లో 65,394 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇనఫ్లో 65,394 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 882.10 అడుగులుంది. ఇది 199.27 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 49,950 క్యూసెక్కులు నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 

ప్రకాశం బ్యారేజి దిగువకు 55వేల క్యూసెక్కులు

తాడేపల్లి టౌన్‌: ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు ఎగువనున్న వాగుల నుంచి ఆదివారం సాయంత్రానికి 67వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు జలవనరుల శాఖ జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 12వేల500 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నట్టు తెలిపారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 5 గేట్లను రెండు అడుగులు, 65 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 55వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.