సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2021-10-26T06:06:50+05:30 IST

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ ఒక క్రస్ట్‌గేట్‌ ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్‌ నీటిమట్టం సోమవారం నాటికి 589.90 అడుగులు(311.74 టీఎంసీలు) ఉంది.

సాగర్‌ నీటి సమాచారం
క్రస్ట్‌గేట్‌ ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత, అక్టోబరు 25: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ ఒక క్రస్ట్‌గేట్‌ ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్‌ నీటిమట్టం సోమవారం నాటికి 589.90 అడుగులు(311.74 టీఎంసీలు) ఉంది.  కుడి కాలువ ద్వారా 8529, ఎడమకాలువ ద్వారా 9076, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 30,369,  ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, వరద కాలువ ద్వారా 400, ఒక క్రస్ట్‌గేట్‌ను ఐదు అడుగుల మేర ఎత్తి 8090, ఔట్‌ఫ్లో 58,264 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇనఫ్లోగా 58,264 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 879.20 అడుగులుంది. జూరాల నుంచి 8244 క్యూసెక్కులు నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.

ప్రకాశం బ్యారేజి దిగువకు..

తాడేపల్లి టౌన్‌: ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. సోమవారం సాయంత్రానికి 36వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు శాఖ జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 16వేల600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 25 గేట్లను 1 అడుగు వంతున ఎత్తి 18వేల500 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.


Updated Date - 2021-10-26T06:06:50+05:30 IST