లోకే విహర రాఘవ!

ABN , First Publish Date - 2021-01-06T07:38:53+05:30 IST

వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ.. యోగవాశిష్ఠం. రాముడు పురుషోత్తముడిగా.. జనులు మెచ్చిన నాయకుడిగా తీర్చిదిద్దిన ఆ పలుకులను ‘వశిష్ఠ రామ సంవాదం’గా కూడా వ్యవహరిస్తుంటారు...

లోకే విహర రాఘవ!

వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ.. యోగవాశిష్ఠం. రాముడు పురుషోత్తముడిగా.. జనులు మెచ్చిన నాయకుడిగా తీర్చిదిద్దిన ఆ పలుకులను ‘వశిష్ఠ రామ సంవాదం’గా కూడా వ్యవహరిస్తుంటారు. అందులో రాముడికి వశిష్ఠ మహర్షి చేసిన ముఖ్యమైన బోధలు నేటికీ అందరికీ అవశ్యం ఆచరణీయాలు. అందులో కొన్ని..


  • పూర్ణాం దృష్టి మవష్టభ్య ధ్యేయ త్యాగ విలాసినీమ్‌,
  • జీవన్ముక్తతయా స్వస్థో లోకే విహార రాఘవ


లక్ష్యము, త్యాగములతో శోభిల్లు పూర్ణదృష్టిని పాటించి ఆత్మనిష్ఠతో లోకంలో సంచరించు, రామా!


  • ఉదారపేశలాచార స్సర్వాచారాసువృత్తిమాన్‌
  • అంతస్సర్వపరిత్యాగీ లోకే విహార రాఘవ


ఔదార్యము, సాధుప్రవర్తనలతో, శాస్త్ర సమ్మతములైన అన్ని ఆచారాలను ఆచరిస్తూ, వాటివలన కలిగే ఫలితాలను వదలిపెడుతూ, లోకంలో సంచరించు రామా!


  • అంతర్నైరాశ్య మాసాద్య బపారాశోన్ముఖే పాతః
  • బహి స్తప్తో-స్తరాశీతో లోకే విహర రాఘవ


కోరికలతో జీవించేవారికి హితం చేస్తూ, కోరికలు లేనివాడవై ప్రశాంతతమైన మనసుతో లోకంలో సంచరించు రామా!


  • బహిః కృత్రిమసంరమ్భోహృది సంరమ్భవర్జితః
  • కర్తా బహి రకర్తా-స్తః లోకే విహర రాఘవ


లోకసంబంధమైన కర్మలను నిర్వర్తించటంలో ఆతృతను చూపిస్తూ, కర్తృత్వం లేకుండా, లోకంలో సంచరించు రామా!


  • కృత్రిమోల్లాసహర్షస్థః కృత్రిమోద్వేగగరణః
  • కృత్రిమారంభసంరంభో లోకే విహర రాఘవ


ధర్మబద్ధ కార్యక్రమాలు జరుగుతున్నపుడు సంతోషాన్ని, అధర్మకలాపాలు చేస్తున్నవారిపట్ల అసహనాన్ని కనబరుస్తూ.. లోకహిత కార్యకలాపాలు చేయడంలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. లోకంలో విహరించు రామా!


  • త్త్యక్తాహంకృతి రాసుప్తమాతి రాకాశశోభనః
  • అగృహీతకలంకో-స్మిన్‌ లోకే విహర రాఘవ


కర్తృత్వ అహంకారాన్ని వదిలి, అమనస్కుడవై, గగనంలా శోభిల్లుతూ, లోకం ఆపాదించే దోషాల్ని పట్టించుకోక, లోకంలో సంచరించు, రామా!

- వీఎ్‌సఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2021-01-06T07:38:53+05:30 IST