Abn logo
Mar 16 2020 @ 04:29AM

ఈ వారం సాహితి కార్యక్రమాలు

తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారం

శ్రీమతి తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారాన్ని కొండపల్లి నీహారిణి స్వీకరిస్తారు. ప్రదాన సభ మార్చి 16 సా.6గం.లకు దేవులపల్లి రామాను జరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్‌, హైదరా బాద్‌లో జరుగుతుంది. సభలో ఎల్లూరి శివారెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య, సుమతీ నరేంద్ర తదితరులు పాల్గొంటారు.  

జె.  చెన్నయ్య

‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ నవలలు

సలీం రాసిన ‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ నవలల ఆవిష్కరణ సభ మార్చి 17 సా.6గ.ంలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైద రాబాద్‌లో జరుగుతుంది.

పాలపిట్ట బుక్స్‌

తెలంగాణ దళిత సాహిత్యం, సంస్కృతి, కళారూపాలపై సదస్సు

ఈ రెండు రోజుల సదస్సు మార్చి 18, 19 తేదీల్లో దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌, కె.శ్రీనివాస్‌, జూపాక సుభద్ర, గుఱ్ఱం సీతారాములు, దాసరి రంగ, పి. కనకయ్య, నందిగామ నిర్మల కుమారి, తైదల అంజయ్య, గడ్డం మోహన్‌ రావు తదితరులు పాల్గొంటారు. 

జె. చెన్నయ్య 

‘దుర్గాపురం రోడ్‌’కు ఉమ్మడిశెట్టి సత్యాదేవి అవార్డు

ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు-2019కు దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’ కవిత్వ సంపుటి ఎంపికైంది.  

ఉమ్మడిశెట్టి రాధేయ


Advertisement
Advertisement
Advertisement