ఈ వారం సాహితి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-03-23T08:52:29+05:30 IST

కెవిఆర్‌ పుస్తకాల ఆవిష్కరణ పతంజలి పురస్కారం నవలలు, నానీల పోటీ ఆంధ్ర ప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌కు విన్నపం...

ఈ వారం సాహితి కార్యక్రమాలు

కెవిఆర్‌ పుస్తకాల ఆవిష్కరణ

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కథలకు కె.వి. రమణారెడ్డి చేసిన అనువాదాలతో ‘ఆటబొమ్మలు’ కథా సంకలనం, ‘కె.వి. ఆర్‌. స్మృతిలో’ వ్యాస సంకలనం- ఈ రెంటి ఆవిష్కరణ సభ మార్చి 29 సా.5.30ని.లకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాల్‌, చల్లపల్లి బంగ్లా వద్ద, విజయవాడలో జరుగుతుంది. సింగంపల్లి అశోక్‌కుమార్‌, తాటి శ్రీ కృష్ణ, ఎన్‌.అంజయ్య పాల్గొంటారు. 

కెవిఆర్‌-శారదాంబ స్మారక కమిటీ

పతంజలి పురస్కారం

కెఎన్‌వై పతంజలి పేరిట ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అట్టాడ అప్పలనాయుడు స్వీకరి స్తారు. పురస్కారం కింద రూ.5వేలు నగదు ఇస్తారు. పురస్కార ప్రదాన సభ ఏప్రిల్‌లో జరుగుతుంది.  

ఎన్‌కె బాబు

నవలలు, నానీల పోటీ

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఆధ్వర్యంలో పోటీకి నవలలు, నానీలను ఆహ్వానిస్తున్నాం. ఉత్తమ నవలకు రూ.25వేలు, ఉత్తమ నానీలకు రూ. 3వేలు బహుమతి. ఈ రచనలను జులై 25లోగా చిరునామా: పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి, వంశీ నర్సింగ్‌ హోమ్‌, ఇందిరా భవన్‌రోడ్‌, నెల్లూరు- 524001కు పంపాలి. మరిన్ని వివరా లకు ఫోన్‌: 94402 79594.

ఈతకోట సుబ్బారావు

ఆంధ్ర ప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌కు విన్నపం

రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి గ్రంథా లయ సంస్థ విభజన జరిగాక తెలం గాణ గ్రంథాలయ పరిషత్‌ ఇప్పటి వరకు మూడుమార్లు పుస్తకాల కొను గోలు ప్రకటనలు ఇచ్చింది. కానీ ఇప్పటి దాకా ఆంధ్ర ప్రదేశ్‌ గ్రంథాలయ సంస్థ ఒకసారి కూడా కొనుగోలు ప్రకటన చేయలేదు. ఫలితంగా ఆం.ప్ర రచయి తలు, ప్రచురణకర్తలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఆం.ప్ర. గ్రంథాలయ పరిషత్‌ కూడా కొనుగోలు ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం.

సంగిశెట్టి శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, యాకూబ్‌, మెర్సీ మార్గరెట్‌, నాళేశ్వరం శంకరం, వఝల శివకు మార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, వారాల ఆనంద్‌, సి.హెచ్‌. ఉషారాణి.

Updated Date - 2020-03-23T08:52:29+05:30 IST