Abn logo
Aug 14 2020 @ 23:54PM

సాయితేజ్‌ మిస్టరీ థ్రిల్లర్‌

సాయితేజ్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్‌ సంస్థలు నూతన చిత్రాన్ని శుక్రవారం ప్రకటించాయి. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. తేజ్‌ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ సినిమా పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని పోస్టర్‌  మీద సంస్కృతంలో రాసున్న వాక్యం, షడ్చక్రంలో ఓ కన్ను... చూస్తుంటే మిస్టీక్‌ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ‘‘సరికొత్త జానర్‌లో సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అదీ నాకెంతో ఇష్టమైన సుకుమార్‌తో కలిసి పని చేయడం మరింత ప్రత్యేకం’’ అని సాయి తేజ్‌ ట్వీట్‌ చేశారు. హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

Advertisement
Advertisement
Advertisement