Sep 11 2021 @ 00:07AM

సాయి ధరమ్ తేజ్ సేఫ్: అల్లు అరవింద్

హైదరాబాద్‌: కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ సేఫ్‌గా ఉన్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. సాయి ధరమ్‌కు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు. అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు. తాను డాక్టర్లతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సాయి ధరమ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం చికిత్సను అందిస్తున్నదని ఆయన తెలిపారు.