Sep 10 2021 @ 23:10PM

అపోలో ఆస్పత్రికి సాయిధరమ్ తేజ్‌

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. కేబుల్ బ్రిడ్డి దాటిన తరువాత కోహినూర్ హోటల్ వద్ద జరిగిన ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. కేబుల్‌ బ్రిడ్జి-ఐకియా రూట్‌లో ప్రమాదం జరిగింది. హోటల్ వద్ద రోడ్డపై ఉన్న ఇసుక కారణంగా సాయిధరమ్‌ నడుపుతున్న స్సోర్ట్స్ బైక్ స్కిడ్ అయి జారీ పడింది. వేగంగా వస్తుండడంతో ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్ స్కిడ్  కావడంతో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను మెడికవర్ ఆస్పత్రికి తరలించి  ప్రాథమిక చికిత్స అందించారు.

 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిరంజీవి కుటుంబ సభ్యులకు ప్రమాదంపై ఏబీఎన్‌ సమాచారం ఇచ్చింది. మెడికవర్‌ ఆస్పత్రికి సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆస్పత్రికి  పవన్‌కల్యాణ్‌, వైష్ణవ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌, నిహారిక చేరుకున్నారు. హీరో సందీప్‌ కిషన్‌తో పాటు మరికొందరు ఆస్పత్రికి వచ్చారు. మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్‌తేజ్‌ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి చిరంజీవి, సురేఖ చేరుకున్నారు.