సాయి తేజ్‌ వద్ద బైక్ లైసెన్స్‌లభ్యం కాలేదు: డీసీపీ

ABN , First Publish Date - 2021-09-12T03:07:33+05:30 IST

నగరంలోని కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌

సాయి తేజ్‌ వద్ద బైక్ లైసెన్స్‌లభ్యం కాలేదు: డీసీపీ

హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని డీసీపీ పేర్కొన్నారు. ‘‘సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి బైక్‌ కొన్నారు. అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నాం. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదు. గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌పై రూ.1,135 చలాన్‌ వేశాం. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ ఓ అభిమాని క్లియర్‌ చేశారు. రోడ్డు ప్రమాదం సమయంలో 72 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్నారు. దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్‌ నడుతుపున్నారు. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారు. ఆటోను లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఓవర్‌ టెక్‌ చేయబోయి స్కిడ్‌డై కిందపడ్డారూ. తేజ్‌ వద్ద టూ వీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాకు లభ్యం కాలేదు. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉంది. ప్రమాదం సమయంలో హెల్మెట్‌ ధరించి ఉన్నాడు.’’ అని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

 


శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైకు పైనుంచి జారిపడ్డాడు. దీంతో ఛాతి, కడుపు, కుడి కన్నుపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-09-12T03:07:33+05:30 IST