Abn logo
Apr 10 2020 @ 08:45AM

వెబ్ సిరీస్ ఆలోచ‌న‌లో...!

సినిమాల‌కు ధీటుగా డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్ పోటీ ప‌డుతుంది. బోల్డ్ కంటెంట్‌, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పే తీరుతో పాటు చిన్నా, పెద్ద సినిమాలు విడుద‌లైన నెల‌, రెండు నెల‌ల లోపే డిజిట‌ల్‌లో ప్రసార‌మ‌వుతున్నాయి. ఇలా అన్నీ కలిసి రావ‌డంతో డిజిట‌ల్ మాధ్య‌మం వైపు ఆక‌ర్షితులైయ్యే ప్రేక్ష‌కులు ఎక్కువ‌య్యారు. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్ స్టార్‌కే ప‌రిమిత‌మైన ఈ మాధ్య‌మాల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల విష‌యానికి వ‌స్తే అల్లు అర‌వింద్ ఇటీవ‌ల ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. దీంతో మ‌రి కొంతమంది నిర్మాత‌లు ఓటీటీ రంగంలోకి రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాతలు వెబ్ సిరీస్‌లు రూపొందించ‌డానికి న‌టీన‌టులు వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు నిర్మాత సాయికొర్రపాటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వైపు అడుగులు వేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈగ స‌హా ప‌లు సినిమాల‌ను నిర్మించిన ఆయ‌న త్వ‌ర‌లోనే వెబ్‌సిరీస్‌ను నిర్మించ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.

Advertisement
Advertisement
Advertisement