Abn logo
Jun 4 2020 @ 09:30AM

ప్రముఖ డైరెక్టర్‌కు సాయిపల్లవి `నో` చెప్పిందా?

చేసినవి తక్కువ సినిమాలే అయినా తన నటనతో, డ్యాన్స్‌తో తెలుగు వారిని ఫిదా చేసింది హీరోయిన్ సాయిపల్లవి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే సాయిపల్లవి ఒక సినిమా అంగీకరించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పాత్ర తనకు నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, స్టార్ హీరో అయినా `నో` చెప్పేస్తుంది. 


తాజాగా డైరెక్టర్ తేజకు సాయిపల్లవి `నో` చెప్పిందట. గోపీచంద్ కథానాయకుడిగా డైరెక్టర్ తేజ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే బాగుంటుందని తేజ భావించాడట. ఆమెను సంప్రదించాడట. అయితే ఆ సినిమాలో నటించేందుకు సాయిపల్లవి నిరాకరించిందని సమాచారం. యంగ్ హీరోలతో నటిస్తున్న తను, మిడిల్ ఏజ్డ్ హీరోతో చేస్తే కెరీర్‌కు ఇబ్బంది ఎదురవుతుందని సాయిపల్లవి భావించిందట. దీంతో తేజ మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్నాడట. 

Advertisement
Advertisement
Advertisement