ఈరోజు చాలా ప్రత్యేకం: సాయిపల్లవి

ఈ రోజు తనకు చాలా ప్రత్యేకం అని అంటున్నారు హీరోయిన్‌ సాయి పల్లవి. ఆమె చెల్లి పూజా కన్నన్‌ కథానాయికగా వెండితెరకు పరిచయమవుతున్నారు. పూజా నటించిన ‘చిత్తిరై సేవానమ్‌’ శుక్రవారం జీ5 ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. తన చెల్లిలి శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ లేఖ పోస్ట్‌ చేశారు సాయిపల్లవి. 

‘‘పూజా.. నీ గురించి నాకు మాత్రమే తెలిసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసుకోనుంది. ఆరోగ్యం బాగోలేదని అమ్మనాన్నకు చెప్పి బంక్‌ కొట్టడం, నిరాశగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ముందుకు వెళ్లడం.. ఇలా ఆఫ్‌స్ర్కీన్‌లోనే కాదు.. ఇప్పుడు ఆన్‌స్ర్కీన్‌లోనూ నటిగా ఎదిగావ్‌. ఈరోజు నీ ఫస్ట్‌ సినిమా విడుదల అవుతోంది. ఐ లవ్‌ యూ. నా సపోర్ట్‌ నీకు ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో నువ్వు  మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా.  నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతా’’ అని తన ప్రేమను  తెలిపింది. ఈ చిత్రానికి శిల్వ దర్శకుడు. జీ తమిళ్‌, అమిర్తా, థింక్‌ బిగ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 


Advertisement