Apr 20 2021 @ 08:44AM

టాలీవుడ్ యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ హీరోయిన్..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ వస్తుండటం సహజమే. కానీ వచ్చిన వాళ్ళలో అందరూ ఇక్కడ సక్సస్ కావడం లేదు. ఒక వేళ సక్సస్ అయినా కొంత మంది హీరోలకే సూటయ్యే పర్సనాలిటీతో ఉంటున్నారు. కానీ ఈ ముంబై బ్యూటీ మాత్రం టాలీవుడ్ యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ పేయిర్ అంటూ మాట్లాడుకుంటున్నారట. ఇంతకీ ఎవరా బాలీవుడ్ బ్యూటీ.. అంటే బాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నట వారసురాలు సాయీ మంజ్రేకర్. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా కూడా బాగానే క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ గత ఏడాదే ఉండాల్సింది. కానీ కరోనా కారణంగా కుదరలేదు. అందుకే ఈ ఏడాది వరసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. టాలీవుడ్‌లో క్షణం, గూడఛారి, ఎవరు..లాంటి విభిన్నమైన సినిమాలతో వరస హిట్స్ అందుకున్న అడవి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా మేజర్. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లలో కూడా పాన్ ఇండియన్ సినిమాగా మేజర్ సిద్ధం అవుతోంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి జంటగా గని సినిమాలో నటిస్తోంది సయీ మంజ్రేకర్. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలిసి సయి మంజ్రేకర్ షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం. సయి మంజ్రేకర్ ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతుందట. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాక్సర్‌గా నటిస్తున్న వరుణ్ తేజ్.. కాలేజ్ స్టూడెంట్ అయిన సయీ మంజ్రేకర్‌తో ప్రేమలో ఎలా పడతాడన్నది ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు. ఇక సయీ మంజ్రేకర్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకుండానే టాలీవుడ్ స్టార్ హీరోలు తన మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ బ్యూటీ మన యంగ్ హీరోలకి బాగా సూటవుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి సాయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో సక్సస్ అవుతుందా లేదా.