Oct 26 2021 @ 16:16PM

Saif Ali Khan ఆస్తుల విలువ రూ. 5 వేల కోట్లు.. ఆయన పిల్లలకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేడు!

బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు, పటౌడీ వారసుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవాబు కుటుంబానికి చెందిన సైఫ్ అలీ ఖాన్‌కు హర్యానాలో పటౌడీ ప్యాలస్ ఉంది. అలాగే భోపాల్‌లో కూడా సైఫ్ కుటుంబానికి భారీ ఆస్తులు ఉన్నాయి. అయితే వాటిని సైఫ్ తన పిల్లలకు వారసత్వంగా అందించలేడు. ఆ ఆస్తులు వివాదాస్పద ఎనిమీ డిస్ప్యూట్స్ యాక్ట్ కిందకు వెళ్లిపోయాయి. 


సైఫ్ అలీ ఖాన్ ముత్తాత, నవాబు అయిన హమీదుల్లా ఖాన్ తన ఆస్తులకు సంబంధించి ఎటువంటి వీలునామా రాయలేదు. దీంతో సైఫ్ అలీఖాన్ తాతయ్య సోదరి వారసులు ఈ ఆస్తులకు సంబంధించి వివాదాలు రేకెత్తించారు. అందువల్ల ఈ ఆస్తులను చట్టపరంగా సైఫ్ అలీఖాన్ లేదా అతని వారసులు అనుభవించడం కుదరదు. కాగా, మొదటి భార్య అమృతా సింగ్ వల్ల సైఫ్‌కు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు. అలాగే రెండో భార్య కరీనా కపూర్ వల్ల తైమూర్, జహంగీర్ జన్మించారు. 

Bollywoodమరిన్ని...