కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా సాయిగోపాల్‌

ABN , First Publish Date - 2021-03-03T06:34:01+05:30 IST

కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా ఎస్వీయూ వైరాలజీ విభాగ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ సాయిగోపాల్‌ నియమితులయ్యారు.

కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా సాయిగోపాల్‌
డీవీఆర్‌ సాయిగోపాల్‌

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 2: కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా ఎస్వీయూ వైరాలజీ విభాగ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ సాయిగోపాల్‌ నియమితులయ్యారు. కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ కాలేజీ కేంద్రంగా కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ, ఉస్మానియా డిగ్రీ కాలేజీలను కలిపి ఒక క్లస్టర్‌ యూనివర్సిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మూడు అటానమస్‌ కాలేజీలతో కూడిన క్లస్టర్‌ యూనివర్సిటీకి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాల మేరకు సాయిగోపాల్‌ను వీసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర మంగళవారం ఉత్తర్వులిచ్చారు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న సాయిగోపాల్‌.. గతంలో ఎస్వీయూ వైరాలజీ విభాగాధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, డీఎస్టీ పర్స్‌ కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Updated Date - 2021-03-03T06:34:01+05:30 IST