సైనాకు మరోసారి కరోనా.. థాయ్‌ ఓపెన్‌కు దూరం

ABN , First Publish Date - 2021-01-12T17:05:46+05:30 IST

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు.

సైనాకు మరోసారి కరోనా.. థాయ్‌ ఓపెన్‌కు దూరం

బ్యాంకాక్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె... తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే కరోనాతో ఆమె ఆటకు దూరం అయ్యారు. పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం నాటి కరోనా టెస్టులకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మంగళవారం టోర్నీ ప్రారంభం అవుతున్న విషయాన్ని చాలా ఉత్సాహంగా తెలిపారు సైనా.  ఆమెతో పాటు మరో క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్‌ కూడా కరోనాకు గురైనట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. 




దాదాపు పది నెలల కరోనా బ్రేక్‌ తర్వాత భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇవాళ్టి షెడ్యూల్ ప్రకారం తొలి రౌండ్‌లో మలేసియా షట్లర్‌ కిసోనా సెల్వడురేతో సైనా, డెన్మార్క్‌ ప్లేయర్‌ మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో సింధు తలపడాల్సి ఉంది. పురుషుల్లో శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, ప్రణయ్‌, కశ్యప్‌ కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. అయితే సైనా, ప్రణయ్‌లకు కరోనా పాజిటివ్ కావడంతో టోర్నీ ఆడలేని పరిస్థితి నెలకొంది.  

Updated Date - 2021-01-12T17:05:46+05:30 IST