సాధువు గుర్రం.. దొంగ కుటిలం

ABN , First Publish Date - 2020-09-23T07:04:47+05:30 IST

ఏదో ప్రయోజనం ఆశించే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారంటూ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌పై సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న

సాధువు గుర్రం..  దొంగ కుటిలం

సోనూ సూద్‌ పిట్టకథ

తనను విమర్శించేవారికి సమాధానం 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22:  ఏదో ప్రయోజనం ఆశించే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారంటూ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌పై సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న విమర్శలకు ఆయన స్పందించారు. ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ పిట్ట కథను చెప్పారాయన.


‘‘ఓ సాధువు వద్ద ఉత్తమ జాతి గుర్రం ఉండేది. ఆయన వద్దకు ఓ దొంగ వచ్చి.. ఆ గుర్రాన్ని తనకు ఇవ్వాలని అడుగుతాడు. అందుకు సాధువు తిరస్కరిస్తాడు. అనంతరం అడవి వైపుగా సాధువు ప్రయాణిస్తుండగా దారిలో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడు కనిపిస్తాడు. సాధువు జాలిపడి ఆ ముసలాయనకు తన గుర్రాన్ని ఇచ్చేస్తాడు. 

తానే ఆదొంగను అని అసలు విషయం చెప్పి వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లబోతాడు. సాధువు ఆపి, గుర్రాన్ని నిరభ్యంతరంగా తీసుకోగానీ ఈ విధంగా తీసుకున్నట్లు ఎవ్వరికీ చెప్పొద్దని కోరతాడు. ప్రజలకు ఈ విషయం తెలిస్తే వాస్తవంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి కూడా సందేహిస్తారని అన్నాడు’’ అని సోనూ సూద్‌ చెప్పారు.


Updated Date - 2020-09-23T07:04:47+05:30 IST