Abn logo
Sep 18 2020 @ 10:18AM

సాయిపల్లవి @ రూ. 2 కోట్లు?

Kaakateeya

తన అద్భుత నటనతో, నాట్యంతో దక్షిణాది వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే సాయిపల్లవి తనకు నచ్చిన సినిమాలను మాత్రమే అంగీకరిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే కనిపించాలనుకుంటుంది. 


రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న `శ్యామ్ సింగరాయ్`లో హీరోయిన్‌గా సాయిపల్లవి ఫిక్స్ అయిందట. ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు అవసరమట. మెయిన్ లీడ్‌గా సాయిపల్లవిని తీసుకుంటున్నారట. ఆ పాత్రలో నటిస్తున్నందుకు సాయిపల్లవి ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోబోతోందట. మరో హీరోయిన్‌గా అదితీరావు హైదరిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement