Abn logo
Dec 23 2020 @ 21:23PM

‘సోలో బ్రతుకే..‌’కు మూర్తిగారి అనుమతి తీసుకున్నాం: సాయితేజ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. నభా నటేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం.. మరో నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 


ఆయన మాట్లాడుతూ..

* సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కొంత వ‌ర‌కు మ‌న ఫ్రీడ‌మ్ త‌న త‌ల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కొంత మంది ప్రేమిస్తే ఫ్రీడమ్ వారి చేతిలో ఉంటుంది. పెళ్లైన త‌ర్వాత భార్య‌, పిల్ల‌ల చేతిలో ఉంటుంది. ఇలా ఒక‌రి చేతిలో మ‌న ఫ్రీడ‌మ్ ఉండిపోతుంది. దీనికి సంబంధించి సినిమాలో మ‌న ఫ్రీడ‌మ్ మ‌న చేతిలో ఉంటుంది అనే డైలాగ్ కూడా పెట్టాం. 

* సినిమాలో విరాట్ త‌న ఫిలాస‌ఫీని ఎంత వ‌ర‌కు న‌మ్ముతున్నాడు. దాని వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏంటి?  దాన్ని ఎలా అధిగ‌మించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

* ఈ సినిమాలో చాలా స్లోగ‌న్స్ ఉన్నాయి. అందులో కొంత మంది తెలివైనోళ్లు .. చాలా మంది పెళ్లైనోళ్లు. ఇంత‌కు ముందు పెళ్లి వ‌ద్దు అనే అంశం మీద చాలా సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా వాటికి భిన్న‌మైన సినిమా అని చెప్ప‌ను. కానీ మాన‌వ సంబంధాలు గురించి చెబుతుంది.  


* పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నేను స్ట్రాంగ్‌గా అనుకున్న‌ప్ప‌టికీ మ‌న కంటే మ‌న అమ్మ‌లు మ‌న‌కు పెళ్లి చేయాల‌నే స్ట్రాంగ్ ఇన్‌టెన్ష‌న్‌తో ఉంటారు. మ‌నం వ‌ద్దు అని ఎంత అనుకున్నా.. చివ‌ర‌కు వాళ్లే గెలుస్తారు. అయితే వీలైనంత కాలం మ‌నం బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌ను పొడిగించ‌డం చేయ‌గ‌ల‌మంతే. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల నాకు ఏడాదిన్న‌ర కాలం బ్యాచ్‌ల‌ర్ లైఫ్ ఎక్స్‌టెండ్ అయ్యింది. 

* థమ‌న్‌తో ఐదో సినిమా చేస్తున్నాను. పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి. నో పెళ్లి, హే ఇది నేనేనా, అమృత సాంగ్‌, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ ట్రాక్ ఇలా అన్నింటికీ ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో నో పెళ్లి సాంగ్‌ను నితిన్ బ్యాచ్ ల‌ర్ పార్టీకో, లేక సంగీత్‌లోనో గిఫ్ట్‌గా ఇద్దామ‌ని అనుకున్నాం. కాని అది నిఖిల్‌, రానాకు కూడా క‌లిసొచ్చింది. ప‌ర్స‌న‌ల్‌గా నాకు బాగా న‌చ్చిన సాంగ్ కూడా ఇదే..మా ఇంట్లో రోజూ సుప్ర‌భాతం త‌ర్వాత మా అమ్మ‌కు విన‌ప‌డేలా ఎక్కువ సౌండ్‌తో ఇదే ప్లే చేస్తూ ఉంటాను( న‌వ్వుతూ)

* సినిమా కంటెంట్‌పై చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. మంచి ఎంట‌ర్‌టైనర్‌. లాక్డౌన్‌లో మ‌నం చాలా వ‌ర‌కు థ్రిల్ల‌ర్స్ చూసుంటాం. కాని ప్రాప‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్, ఫ్యామిలీ అంతా క‌లిసి లేదా ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. 


* ఒక యాక్ట‌ర్‌గా, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో భాగంగా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది.

* గ‌తేడాది జూన్‌లో సుబ్బు ఈ క‌థ చెప్ప‌డం జ‌రిగింది. అప్ప‌టి నుండి త‌ను ఈ స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేస్తూ వ‌చ్చాడు. అప్పుడు నేను ప్ర‌తి రోజూ పండ‌గే షూటింగ్‌లో ఉన్నాను. అది అయిపోగానే వెంట‌నే షూటింగ్ స్టార్ట్ చేశాం.

* మే1 సినిమాని విడుద‌ల చేద్దాం అనుకున్నాం కాని లాక్‌డౌన్ వ‌ల్ల ఆలస్యమై డిసెంబ‌ర్ 25న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. 

* ప్ర‌స్తుతం ఈ క‌రోనా వ‌ల్ల కష్టాల్లో ఉన్న ఇండ‌స్ట్రీకి ఈ సినిమా బాగా ఆడితే కొంత రిలీఫ్ దొరుకుతుంది అని ముందుకు రావ‌డం జ‌రిగింది. 

* పెళ్లి విష‌యంలో ప్ర‌స్తుతం యూత్ ఆలోచ‌న‌లు, అలాగే వారి త‌ల్లితండ్రుల ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయి అనే రెండు అంశాల‌ను తీసుకుని ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని సుబ్బు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. 

* విరాట్ పాత్ర నా నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇదే అని కాదు `చిత్రల‌హ‌రి` నుండి చాలా వ‌ర‌కూ నాకు ప‌ర్స‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే క‌థ‌లే వ‌స్తున్నాయి. 

* త‌ను న‌మ్మిన ఫిలాసఫీ కోసం ఫైట్ చేస్తున్న ఒక యువ‌కుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా క‌థ.

* ఈ క‌థ విన్న‌వెంట‌నే ఆర్ నారాయ‌ణమూర్తిగారి ప‌ర్మీష‌న్ తీసుకోవాలి ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌రికైతే మ‌న‌కు యాక్సెస్‌బిలిటీ చాలా తొంద‌ర‌గా దొరుకుతుంది అనుకున్నాను. వెంట‌నే సుబ్బు తీసుకున్నాను అని చెప్పాడు. మూర్తి గారు కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మ‌న ఇండ‌స్ట్రీ కోసం మ‌నం త‌ప్ప‌క నిల‌బ‌డాలి త‌ప్ప‌కుండా సినిమా చేయండి అని చాలా స‌పోర్టివ్‌గా మాట్లాడారు. ఆయ‌నను ఎప్పుడు క‌లిసిన సినిమా ఎలా వ‌స్తుంది బాగా చేయండి అనే చెప్పారు. ఆయ‌న స‌పోర్ట్ వ‌ల్లే సినిమా ఇంత‌ బాగా వ‌చ్చింది.


* ఈ సినిమాలో నేను ఎంత‌వ‌ర‌కూ జెన్యూన్‌గా ఉన్నాను అని టెస్ట్ చేస్తూ ఉండే పాత్ర‌లో న‌భ చాలా బాగా న‌టించింది. త‌న క్యారెక్ట‌ర్ కూడా చాలా ఎంట‌ర్టైనింగ్‌గా ఉంటుంది. 

* కుదిరితే ముగ్గురు మామ‌య్య‌ల‌కు ఒక స్పెష‌ల్ షో వేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం 

*దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే 60 శాతం మేజ‌ర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఏలూరు, కొల్లేరు సరస్సు చుట్టు పక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది.  ఆ సినిమాలో సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక యువ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తా. అలాగే సుకుమార్ గారి శిష్యుడు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నాను. 2021లో రెండు సినిమాలు విడుద‌ల‌ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను... అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement