Abn logo
May 23 2020 @ 12:45PM

ఏంటి బావా.. నీకు పెళ్లంట: వరుణ్‌కు సాయితేజ్ ప్రశ్న

`ఏంటి బావా.. నీకు పెళ్లంట` అంటూ మెగా హీరో సాయితేజ్, `నిజమా` అంటూ సంగీత దర్శకుడు తమన్.. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. కొన్ని రోజుల కిందట నాగబాబు ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తన పిల్లల వివాహాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. 


నిహారికకు వచ్చే ఏడాది పెళ్లి చేస్తామని, ఆ వెంటనే వరుణ్‌కు కూడా చేసేస్తామని నాగబాబు చెప్పారు. దీంతో పలు వెబ్‌సైట్లలో, యూట్యూబ్ ఛానెళ్లలో `వరుణ్‌కు పెళ్లి` అంటూ వార్తలు మొదలయ్యాయి. `నిహారికకు పెళ్లి.. వరుణ్ తేజ్‌కు కూడా` అని వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన సాయితేజ్.. `ఏంటి బావా.. నీకు పెళ్లంట` అని కామెంట్ చేశాడు. దీనిని రీ-ట్వీట్ చేసిన తమన్.. `నిజమా?` అని ప్రశ్నించాడు. 



Advertisement
Advertisement
Advertisement