Abn logo
Aug 2 2021 @ 21:27PM

కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో తెలుసు: సజ్జల

నెల్లూరు: ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల, మంత్రులు బాలినేని, అనిల్ కుమార్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పేదలందరికీ ఇల్లు పథకం అమలుపై చర్చించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామని చెప్పారు. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసన్నారు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగురాష్ట్రం పెడచెవిన పెట్టిందని వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారని చెప్పారు. ఆంద్రా వాటా నీటిని కాపాడుకునేందుకే సీఎం జగన్ ప్రయత్నించారని చెప్పారు.