Advertisement
Advertisement
Abn logo
Advertisement

సజ్జ రొట్టె

ధుమ రొట్టె చేసినంత సులువు కాదు జొన్న రొట్టె చేయడం అనుకుంటారు. కానీ మెలకువలు అనుసరిస్తే, సజ్జ రొట్టె చేయడం తేలికే!


కావలసిన పదార్థాలు: సజ్జ పిండి: 2 కప్పులు, ఉప్పు: తగినంత, వేడి నీళ్లు: పిండికి సరిపడా, గోధుమ పిండి: రొట్టె అంటుకుపోకుండా


తయారీ ఇలా: గిన్నెలో పిండి వేసి, ఉప్పు, అరకప్పు వేడి నీళ్లు చేర్చి పిండి కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు చేరుస్తూ కనీసం 10 నిమిషాలు కలుపుకోవాలి. ముద్దగా చేసిన పిండిని చిన్న ఉండలుగా విడదీసి, మళ్లీ ఆ ఉండలను విడివిడిగా మర్దించాలి. ఉండను పీట మీద ఉంచి, గోధుమ పిండి అద్దుతూ, రోటీ ఒత్తుకోవాలి. రొటీ అంచుల్లో చినిగిపోతుంటే, పిండి సరిగా మర్దించలేదని అర్థం. రోటీ ఒత్తుకున్న తర్వాత, కాలే పెనం మీద వేసి, తడి బట్టతో రోటీని నొక్కుతూ పొంగేలా చేయాలి. తడి పూర్తిగా ఆరిన తర్వాత రోటీని తిరగేయాలి. రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకుని, కర్రీతో కలిపి సర్వ్‌ చేయాలి.డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటాపచ్చి బొప్పాయి రొట్టెపుదీనా పరోటాకీటో రోటీఉలవల పరోటాహైదరాబాదీ బిదారీ పరాటాపాలకొల్లు దిబ్బరొట్టిఉల్లితో జొన్నరొట్టె (వీడియో) దాల్‌ పరోటామేథీ పరోటా
Advertisement