సజ్జల కిచిడీ

ABN , First Publish Date - 2020-12-05T18:57:44+05:30 IST

సజ్జలు - రెండు కప్పులు, పెసరపప్పు - అరకప్పు, మిరియాలు - ఐదు, లవంగాలు - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, నెయ్యి

సజ్జల కిచిడీ

కావలసినవి: సజ్జలు - రెండు కప్పులు, పెసరపప్పు - అరకప్పు, మిరియాలు - ఐదు, లవంగాలు - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, నీళ్లు - ఐదు కప్పులు.


తయారీ విధానం: ముందు రోజు రాత్రి సజ్జలు, ధాన్యాలను నానబెట్టుకోవాలి. ఉదయాన నీళ్లన్నీ తీసివేసి సజ్జలను గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక మిరియాలు, లవంగాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి.

ఇప్పుడు నానబెట్టిన పప్పు, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న సజ్జలను వేయాలి. తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టు కోవాలి. చిన్నమంటపై ఉడికించాలి. మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఉడికిన తరువాత నెయ్యి వేసుకుని వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.


సజ్జలలో...

ప్రోటీన్లు - 11 గ్రా

క్యాలరీలు - 382

కార్బోహైడ్రేట్లు - 75 గ్రా


Updated Date - 2020-12-05T18:57:44+05:30 IST