సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?: లోకేష్‌

ABN , First Publish Date - 2021-10-07T00:05:59+05:30 IST

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు

సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?: లోకేష్‌

అమరావతి: డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని.. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై విచారణ జరపాలి. 40 ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్షకట్టి పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి.. ఒక్క రూపాయి అయినా అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా? సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటి కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్ రెడ్డి.. ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకూ విస్తరించారు’’ అని నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.

Updated Date - 2021-10-07T00:05:59+05:30 IST