పెట్రో ధరలపై బీజేపీ దుష్ప్రచారం: సజ్జల

ABN , First Publish Date - 2021-11-09T01:08:58+05:30 IST

పెట్రో ధరలపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు

పెట్రో ధరలపై బీజేపీ దుష్ప్రచారం: సజ్జల

అమరావతి: పెట్రో ధరలపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాస్తవాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని సజ్జల పేర్కొన్నారు. పెట్రోల్‌పై ఇప్పటివరకు కేంద్రం రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. దీనిలో ఎక్సైజ్‌ సుంకం కేవలం రూ.47,500 కోట్లు మాత్రమేనని సజ్జల పేర్కొన్నారు. అందులో అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చింది రూ.19,475 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలిన రూ.3.15 లక్షల కోట్లు కేంద్రం ఖజానాకే చేరాయని సజ్జల తెలిపారు. రాష్ట్రాలకు వాటా రాకుండా వివిధ పన్నుల పేరుతో పెట్రో, డీజిల్‌పై కేంద్రం ఆదాయం పొందడం వంచనేనని సజ్జల ఆరోపించారు. పెట్రో ధరలు భారీగా పెంచేసి..డిస్కౌంట్‌లా రూ.5 తగ్గించారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేసారు. మేం తగ్గించాం, మీరూ తగ్గించాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తే ఎలా అని కేంద్రాన్ని సజ్జల ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-09T01:08:58+05:30 IST