పీసీబీ రూల్స్ పాటించని ఏ కంపెనీ అయినా మూతే: సజ్జల

ABN , First Publish Date - 2021-08-04T23:36:11+05:30 IST

పీసీబీ రూల్స్ పాటించని ఏ కంపెనీ అయినా మూతే: సజ్జల

పీసీబీ రూల్స్ పాటించని ఏ కంపెనీ అయినా మూతే: సజ్జల

అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అమరరాజా కంపెనీ తరలిపోతుండడంపై ఏబీఎన్ ప్రతినిధి వివరణ అడిగారు. పీసీబీ నిబంధనలు పాటించని ఏ కంపెనీ అయినా మూతేనని ఆయన పేర్కొన్నారు. పీసీబీ నిబంధనలు పాటిస్తూ ఇక్కడే ఉండొచ్చనని సజ్జల వ్యాఖ్యానించారు. కంపెనీ ఎంత పెద్దది అయినా ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు. కార్మికుల పొట్టగొడితే ప్రభుత్వానికి ఏం సంబంధమని సజ్జల వ్యాఖ్యానించారు. 


కాగా అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు జిల్లా కరకంబాడీ నుంచి తరలిపోతోంది. మూడు నెలల్లో తమిళనాడులో అమరరాజాను నెలకొల్పేందుకు నిర్వాకులు సన్నాహాలు ప్రారంభించారు. సీఎం స్టాలిన్‌ను కలిసి  భూమి కేటాయించాలని కోరారు. దీంతో ఆయన వెంటనే అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరోవైపు బ్యాటరీస్ తరలిపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. 




Updated Date - 2021-08-04T23:36:11+05:30 IST