శాకాంబరిగా చాముండేశ్వరిదేవి

ABN , First Publish Date - 2021-08-02T05:02:54+05:30 IST

మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారం విశేషంగా చేశారు.

శాకాంబరిగా చాముండేశ్వరిదేవి
శాకాంబరి అలంకారంలో అమ్మవారు

ఇందుకూరుపేట, ఆగస్టు 1 : మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారికి   శాకాంబరి అలంకారం విశేషంగా చేశారు. ఆషాడమాసం ఆదివారం కావడంతో కొలపర్తి రమేష్‌కుమార్‌, సుమలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా విశేష పూజలు నిర్వహించారు.   అమ్మవారి శాకాంబరి అలంకారాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో భక్తులు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. ఉభయకర్తలతో పాటు నిర్వాహకులు దండిగుంట శరత్‌నాయుడు, ఫణీంద్ర, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-02T05:02:54+05:30 IST