May 5 2021 @ 08:21AM

పోలీస్‌ అధికారికి సాక్షి అగ‌ర్వాల్ థాంక్స్‌

కోలీవుడ్‌ హీరోయిన్‌ సాక్షి అగర్వాల్‌ గతంలో ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘ఆయిరం జన్మంగళ్‌’, ‘నాన్‌ కడవుల్‌ ఇల్లై’, ‘అరణ్‌మై-3’, ‘సిండ్రెల్లా’, ‘పురవి’, ‘20 అవర్స్‌’, ‘ది నైట్‌’, ‘బహీరా’ వంటి పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల సాక్షి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.  నగరంలోని అన్నాశాలై జెమిని వంతెనపై ఆమె వెళ్తుండగా హఠాత్తుగా కారు బ్రేక్‌డౌన్‌ అయింది. ఎంతగా ప్రయత్నించినా ఆ కారు స్టార్ట్‌ కాలేదు. మరోవైపు అన్నాశాలై ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు తీవ్ర అంత రాయం కలిగింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారి చిట్టిబాబు, మరికొంతమంది పోలీసుల సాయంతో కారును రోడ్డు పక్కకు నెట్టుకుంటూ వెళ్ళారు. దీంతో సాక్షి అగర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించి, తనకు సహాయం చేసిన పోలీస్‌ అధికారికి ధన్యవాదాలు తెలిపారు.