యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోయే భారీ పాన్ ఇండియా చిత్రం `సలార్`. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా బయటకు వచ్చేసింది. ఈ సినిమా గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని ఇటీవల ఓ వార్త చక్కర్లు కొట్టింది.
తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోందట. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక్కడ పది రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయట. ఆ పనులు పూర్తవగానే చిత్రబృందం ఇక్కడకు వస్తుందట.