Abn logo
Jan 14 2021 @ 14:15PM

`సలార్` అప్‌డేట్: ముహూర్తం ఫిక్స్!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `సలార్`. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిర్మాణ సంస్థ అదిరిపోయే అప్‌డేట్ అందించింది. `సలార్` సినిమా షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు తెలిపింది.


రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు `సలార్‌` సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి `కేజీఎఫ్` స్టార్ యశ్‌తో పాటు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా నటించబోతున్నట్టు ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అలాగే బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటిస్తున్నట్టు కూడా టాక్ వచ్చింది. వీటి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

Advertisement
Advertisement
Advertisement