సలాడ్‌

ABN , First Publish Date - 2021-03-20T19:29:04+05:30 IST

ఖర్బూజ - ఒకటి పెద్దది, బొప్పాయి ముక్కలు - కొన్ని, నిమ్మరసం - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఆవాల పేస్టు - ఒక టీస్పూన్‌, మిరియాలు - కొద్దిగా, పంచదార - పావు కప్పు, ఉప్పు - తగినంత.

సలాడ్‌

కావలసినవి: ఖర్బూజ - ఒకటి పెద్దది, బొప్పాయి ముక్కలు - కొన్ని, నిమ్మరసం - పావు కప్పు,  పచ్చిమిర్చి - ఒకటి, ఆవాల పేస్టు - ఒక టీస్పూన్‌, మిరియాలు - కొద్దిగా, పంచదార - పావు కప్పు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసి మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఖర్బూజ, బొప్పాయి పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు పండ్ల ముక్కలపై ఫ్రిజ్‌లో పెట్టుకున్న మిశ్రమం పోయాలి. తరువాత ఆవాల పేస్టు, మిరియాల పొడి చల్లాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. చల్లగా చల్లగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే ఖర్బూజా, బొప్పాయి సలాడ్‌ టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2021-03-20T19:29:04+05:30 IST