Abn logo
Apr 2 2020 @ 17:44PM

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం లేదు: అశోక్‌బాబు

అమరావతి: సీఎం జగన్ తన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు దుయ్యబట్టారు. ఉద్యోగుల జీతాల పెంపుపై ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం లేదని, పెన్షనర్లకు కూడా చెల్లింపులు ఆపే హక్కు జగన్‌కు లేదని హెచ్చరించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, జగన్ ఇచ్చిన జీవో కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికేనని అశోక్‌బాబు విమర్శించారు.

Advertisement
Advertisement
Advertisement