Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేతనాలు పెంచాలి

నూజివీడు టౌన్‌, డిసెంబరు 3: మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు తక్షణమే వేతనం పెంచాలని ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్రవంతి డిమాండ్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి శుక్రవారం ఆమె ధర్నా చేశారు. పథకంలో పని చేసే కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీస వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ఏ స్కీమ్‌ కార్మికులకు లేని విధంగా ముందుగా కార్మికులే పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి ఉందన్నారు. తక్షణం కనీస గ్రాట్యుటీ రూ.లక్ష చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో మహాధర్నా చేస్తామన్నారు. త్యాగరాజు, సీహెచ్‌ వెంకట రామారావు, పుల్లారావు, బత్తుల వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement