Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో బ్లాక్‌ ఫంగస్‌ మెడిసిన్‌ బ్లాక్‌లో విక్రయం

హైదరాబాద్‌: ప్రగతినగర్‌లో బ్లాక్‌ ఫంగస్‌ మెడిసిన్‌ బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెలోన్‌ ల్యాబ్‌లో తయారయ్యే అంబిలోన్‌ టాబ్లెట్‌ను మెడికల్‌ షాపులకు ఎర్రగడ్డ ఈఎస్‌ఐ వైద్యుడు ఓబుల్‌రెడ్డి విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ముగ్గురిని మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే పరారీలో ఓబుల్‌రెడ్డి ఉన్నారు. యాంటీబయాటిక్‌ మందులకు అంబిలోన్‌ స్టిక్కర్లు వేసి అమ్ముతున్న.. సుచిత్రలోని మానస మెడికల్స్‌ యజమాని శ్రీధర్‌రెడ్డిని కూడా అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల విలువైన మందులు, కారు, బైక్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement