విక్రయ వేళలు కుదింపు

ABN , First Publish Date - 2020-03-30T10:33:28+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల విక్రయాల సమయాన్ని కుదింపు

విక్రయ వేళలు కుదింపు

ఉదయం 6 నుంచి 11 గంటల వరకే సరుకులు

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలంసాహ్ని


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మార్చి 29 : పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల విక్రయాల సమయాన్ని కుదింపు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. కలెక్టర్‌లు, ఎస్పీలతో ఆదివారం సాయంత్రం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే సరుకుల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే కరోనా నివారణ కోసం.. ఆసుపత్రిలలో వైద్యులను, సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు.


పక్కాగా లాక్‌డౌన్‌ అమలు కావాలని తెలిపారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ మాట్లాడుతూ అటవీశాఖ, ఎక్సైజ్‌, ప్రజారవాణా, జీఎస్టీ, పీఈటీ... తదితర సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ఐటీడీఏ పీఓ సాయికాంత్‌వర్మ, ట్రైనీ కలెక్టర్‌ భార్గవతేజ, జేసీ-2 గున్నయ్య, డీఆర్వో దయానిధి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:33:28+05:30 IST